Friday, November 22, 2024
Homeపాలిటిక్స్Nizamabad Cong ticket: నిజామాబాద్ లో జీవన్ రెడ్డి Vs సునీల్ రెడ్డి

Nizamabad Cong ticket: నిజామాబాద్ లో జీవన్ రెడ్డి Vs సునీల్ రెడ్డి

ఎలాగైనా నిజామాబాద్ ఎంపీ సీటు గెలిచేలా..

నిజామాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఎలాగైనా కైవసం చేసుకోవాలనే కసి మీద ఉన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అసలే నిజామాబాద్ కేసీఆర్ కుమార్తె కవిత సొంత ఇలాఖాలా ఆమె తెగ ఇదైపోతుంటారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ తోపాటు ప్రధాన రాజకీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులపై ఇక్కడ చాలా ప్రెజర్ ఉండనుంది. మరోవైపు ఇప్పటికే నిజామాబాద్ గెలుపోటములపై భారీగా పందాలు ఊపందుకునేందుకు రంగం సిద్ధమైంది.

- Advertisement -

త్రిముఖ పోరులో..

ఈ నేపథ్యంలో అసలు కాంగ్రెస్ గెలుపు గుర్రంగా ఇక్కడ ఎవరికి రేవంత్ టికెట్ ఇస్తారన్నది నరాలు తెగే ఉత్కంఠంను రేకెత్తిస్తోంది. ఇప్పటికే ఇక్కడి సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ మరోసారి గెలిచేందుకు సర్వం ఒడ్డే యోచనలో ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ ఏకంగా పెద్దాయన బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డికి టికెట్ కట్టబెట్టింది. ఇక ఈ త్రిముఖ పోరులో మిగలింది కాంగ్రెస్ పార్టీ. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం ఇంకా అభ్యర్థిని ఖరారు చేసే కసరత్తులోనే మునిగి తేలుతోంది. ఎందుకంటే మిగతా పార్లమెంట్ స్థానాల్లాగే ఇక్కడి పార్లమెంట్ టికెట్ కోసం కూడా కాంగ్రెస్ పార్టీకి మంచి డిమాండ్ వచ్చింది. కానీ కాంగ్రెస్ వర్గాలు చెబుతున్న విశ్వసనీయ సమాచారం మేరకు సీనియర్ కాంగ్రెస్ నేత జీవన్ రెడ్డి, ఆరెంజ్ ట్రావెల్స్ అధినేత సునీల్ రెడ్డి మధ్యనే టికెట్ కోసం గట్టి పోటీ నడుస్తోంది.

ఏ క్షణమైనా ప్రకటన..

ఇటు అభ్యర్థి ఎంపికపై సీఎం రేవంత్ ఇప్పటికే నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కాంగ్రెస్ నేతలందరితో పలు దఫాలుగా సమాలోచనలు జరిపాక, అభ్యర్థి ఎంపిక దాదాపు ఖరారైనట్టు కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి లేదా బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి టికెట్ ఆశావాహుల్లో ముందుడగా వీరిద్దరిలో ఎవరో ఒకరికి టికెట్ ఇస్తున్నట్టు రేవంత్ ప్రకటించే ఛాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది.

జీవన్ రెడ్డి వైపే మొగ్గు?

టికెట్ కోసం జీవన్ రెడ్డి, సునీల్ రెడ్డిల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. నేతలు ఎవరి ప్రయత్నలు వారు చేసుకుంటున్నారు. మెజారిటీ నేతలు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వైపు మొగ్గు చూస్తున్నట్లు, దాదాపు జీవన్ రెడ్డి పేరు ఖరారు అయినట్లు, ఏఐసీసీ పెద్దలు జీవన్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు జీవన్ రెడ్డి అనుచరులు బహిరంగంగా చెప్పుకుంటున్నారు. సునీల్ రెడ్డి అనుచరులు తమ నేతకే టికెట్ వస్తుందని చెబుతున్నారు.

తాటిపర్తి జీవన్ రెడ్డి

తాటిపర్తి జీవన్ రెడ్డి ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసి, ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు. గతంలో రోడ్డు రవాణా శాఖ మంత్రిగా పనిచేయడం నిజామాబాద్ పార్లమెంట్ కు సంభందించిన ప్రతి నియోజకవర్గ నేతలతో సన్నిహిత సంభందాలున్న సీనియర్ గా ఉన్నారు. మచ్చలేని నాయకుడిగా, వివాద రహితుడిగా జీవన్ రెడ్డికి మంచి పేరు ఉంది. ఏఐసీసీ, పీసీసీ పెద్దల సహకారం, రైతుల నుండి పూర్తి మద్దతు ఉండటం, బలమైన రెడ్డి సామాజిక వర్గం అండదండలు జీవన్ రెడ్డికి కలిసివచ్చే అంశం.

ఆరెంజ్ ట్రావెల్ అధినేత ముత్యాల సునీల్ రెడ్డి
గత రెండు శాసనసభ ఎన్నికల్లో బాల్కొండ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేసి కొద్ది తేడాలో సునీల్ రెడ్డి ఓడిపోయారు. ఆరెంజ్ ట్రావెల్స్ అధినేతగా అందరికి సుపరిచితుడు. గతంలో టి ఆర్ యస్ లో పనిచేసి గత ఎన్నికల ముందు కాంగ్రెస్ లో చేరిన సునీల్ రెడ్డికి పార్లమెంట్ పరిధిలో నాయకులందరితో సత్సంబంధాలు ఉన్నాయి. అంగ, అర్ధ బలం ఉండటం సునీల్ రెడ్డికి కలిసి వచ్చే అంశాలు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News