Friday, May 10, 2024
HomeతెలంగాణGarla: బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

Garla: బిఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

కార్యకర్తలే పార్టీని బలోపేతం చేశారు

బిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను గార్లలో ఘనంగా నిర్వహించారు. తొలుత మండల కేంద్రంలోని స్థానిక బస్ స్టేషన్ సమీపంలోని ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు గంగావత్ లక్ష్మణ్ నాయక్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించి, పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం ఆవిర్భావ వేడుకకు హాజరైన కార్యకర్తలకు మిఠాయిలను పంచిపెట్టి ఆవిర్భావ శుభాకాంక్షలు తెలియజేశారు.

- Advertisement -

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త్యాగాల పునాదుల మీద పుట్టి ప్రత్యేక రాష్ట్రం సాధించిన పార్టీ బిఆర్ఎస్ అని, ఎన్నో ఆటుపోట్లను అధిగమించి బలమైన పునాదులు వేసింది కార్యకర్తలే అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం అధ్యక్షులు పానుగంటి రాధాకృష్ణ టౌన్ ప్రెసిడెంట్ గాజుల గణేష్ ప్రభాకర్ వెంకటేశ్వర్లు పాషా తాళ్లూరి రవీందర్ పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News