Friday, May 10, 2024
HomeతెలంగాణGarla: ముల్కనూర్ పిహెచ్ సిని తనిఖీ

Garla: ముల్కనూర్ పిహెచ్ సిని తనిఖీ

డిప్యూటీ డిఎంహెచ్ఓ ఆధ్వర్యంలో..

మండల పరిధిలోని ముల్కనూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని డిప్యూటీ డిఎంహెచ్ ఓ డాక్టర్ అంబరీష్ ఆకస్మికంగా తనిఖీ చేసి, రికార్డులను పరిశీలించి, వైద్య సిబ్బంది పనితీరును ఆరా తీశారు. ఎండ తీవ్రత విపరీతంగా ఉండటం వల్ల వడదెబ్బ ప్రభావం ఎక్కువ ఉందని, ప్రజలు పలు జాగ్రత్తలు తీసుకునే విధంగా సలహాలు సూచనలు అందించాలని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలని సిబ్బందికి సూచించారు. వ్యాధి నిరోధక సికిల్ సెల్ స్క్రీనింగ్, ఎన్ హెచ్ డి హెచ్ ఆర్ ఐ ఎం సి హెచ్ టీబీ పలు జాతీయ కార్యక్రమాలను నిర్వహించి, ప్రజలకు అవగాహన కల్పించి, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పనితీరును మెరుగుపరచడానికి కృషి చేయాలని ఆదేశించారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో డాక్టర్ విజయ్ కుమార్ సిహెచ్ఓ కృష్ణార్జునరావ్ వైద్య సిబ్బంది డాక్టర్ రవితేజ హెచ్ ఈ ఓ శ్రీహరి తదితరులు ఉన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News