Tuesday, November 26, 2024
Homeఓపన్ పేజ్May day: మేడేన లోపిస్తున్న కార్మిక సంక్షేమ చర్యలు

May day: మేడేన లోపిస్తున్న కార్మిక సంక్షేమ చర్యలు

ప్రపంచవ్యాప్తంగా కార్మికులంతా ప్రతి సంవత్సరం మే 1వ తేదీన కార్మిక దినోత్సవం పండుగను జరుపుకుంటారు. ‘మేడే’ అనేది అంతర్జా తీయ కార్మిక సంఘీభావానికి చిహ్నం. కార్మికులు సాధించిన విజయానికి నిలువెత్తు నిదర్శనం. కార్మిక శ్రేణులు ఏకం కావాల్సిన చారిత్రకసందర్భం కూడా ఇదే. అంతర్జాతీయ శ్రామిక వర్గానికి మేడే ఒక పర్వదినంగా స్థిరపడిపోయింది. కార్మికుల కష్టాలకి గుర్తుగాఈ రోజుని చాలా దేశాలు ప్రభుత్వ సెలవు దినంగా పాటిస్తాయి. మేడే ఉద్యమం తొలుత 1886 లో అమెరికాలోని చికాగో నగరంలో కార్మికుల హక్కు ల కోసం మొదలైఅంచెలంచెలుగా అన్ని దేశాలకూ వ్యాపించింది.పనిగంటల తగ్గింపు, తదితరడిమాండ్లకై పోరాడుతున్న కార్మికులపై అప్పటి అమెరికన్‌ ప్రభు త్వం జరిపిన పోలీస్‌ కాల్పుల్లో కొంతమంది కార్మి కులు అసువులు బాసారు. కార్మికులు నేలకొరుగుతూ తమ రక్తంతో తడిసిన బట్టలను కార్మికవర్గ పోరాటా లకు సంకేతమైన ఎర్రజెండాలుగా ఎగురవేశారు. చివ రకు ప్రభుత్వాలు దిగివచ్చి8 గంటల పనిదినాన్ని అంగీకరించాయి. ఆనాటినుండి ‘ప్రపంచ కార్మికు లారా ఏకంకండి’ అన్న నినాదంతో ఐక్యత ప్రదర్శించి ‘మేడే’ను జరుపుకుంటున్నారు.భారత్‌లో 1923 మే 1న మద్రాసులో లేబర్‌ కిసాన్‌ పార్టీ ఆధ్వర్యంలో తొలిసారి కార్మిక దినోత్సవ వేడుకలు జరిగాయి. అప్ప టినుంచి మన కార్మికులు కూడా ఏటా మే 1న కార్మిక దినోత్సవం పాటించి, వేడుకలు జరుపుకోవడం ఆనవా యితీగా వస్తోంది. కార్మికుల నిరసన ప్రదర్శనలకు మరియు సంక్షేమ పథకాల అమలుకు మేడే వేదికగా మారింది.
కానరాని సంక్షేమ చర్యలు
గతంలో మేడే సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు కార్మికులకు కొన్ని సంక్షేమ పథకాలు, ప్రో త్సాహకాలు ప్రకటించేవి.పనిలోఅత్యుత్తమ ప్రతిభను, నైపుణ్యాలను ప్రదర్శించి పనిచేసిన కార్మికులకు, ఉద్యో గులకు ‘శ్రమ అవార్డులు’ ఇచ్చి సత్కరించేవారు. ఈ చర్యలవల్ల కార్మికులకు వ్యక్తిగతమైన గుర్తింపులు, గౌరవమర్యాదలు దక్కుతాయి.తద్వారా వారు ఉత్సాహ ఉత్తేజాలు పొంది తమ విధుల్ని మరింత ఇష్టంతో, సంతోషంతో, అంకితభావంతో నిర్వర్తిస్తారు. అంతేగాక పనిలో పోటీతత్వం పెరిగి ఉత్పత్తి, ఉత్పాద కతలు పెంపొందుతాయి. అలాగేరాష్ట్ర కార్మిక శాఖ ఆధ్వర్యంలో కార్మికులకుసాంస్కృతిక కార్యక్రమంలో భాగంగా ఆటల పోటీలు నిర్వహించి బహుమతులు ఇచ్చేవారు. ఇంకా కార్మికులకు సంబంధించి ప్రభు త్వాలు ప్రవేశపెట్టబోయే కొత్త పథకాన్నో, కార్యక్ర మాన్నో మేడే నాడు ప్రకటించి కార్మిక వర్గానికి తీపి కబురు అందించేవారు.అలా ఆనవాయితీగా ప్రకటిం చే సంక్షేమ కార్యక్రమాలు, వరాలు నేడు మృగ్యమైపో యాయి. ఈ పరిస్థితుల్లో మేడేక్రమంగాప్రాభవం కో ల్పోతుందా అనిపిస్తోంది! ఒకప్పుడు రెపరెపలాడే ఎర్ర జెండాల ప్రదర్శనలతో, కదంతొక్కే కార్మిక శ్రేణులతో, ఉర్రూతలూగించే నినాదాలు, పాటల సందడులతో ‘మేడే’ఓ ప్రత్యేకమైన ఆకర్షణగా ఉండేది.అలాంటిది పోనుపోను మేడే వేడుకలు పేలవంగా మారి పోతున్నాయి. దానికితోడు కరోనా మహమ్మారి కార ణంగా తలెత్తిన సంక్షోభంతో గత మూడు సంవత్స రాల నుంచి అసలు మేడే వేడుకలేకరువయ్యాయి. కోవిడ్‌ విజృంభణ భారత్‌లో కార్మికులను తీవ్రంగా దెబ్బ తీసింది. దేశంలో కరోనా కారణంగా తలెత్తిన ఆర్థిక సంక్షోభంతో చాలామంది కార్మికులు ఉపాధి కోల్పోయి, ఆదాయం లేక నానా అవస్థలు పడుతు న్నారు. ముఖ్యంగా వలస కార్మికులు, భవన నిర్మాణ కార్మికులు, అసంఘటిత రంగ కార్మికులపై కరోనా ప్రభావం తీవ్రంగా పడింది. వీరిని ఆదుకునే ప్రభుత్వ చర్యలు చూస్తే అంతంతమాత్రంగా ఉన్నాయి.అంతర్‌ రాష్ట్ర వలస కార్మికుల చట్టం-1979, భవన నిర్మాణ రంగ కార్మికుల చట్టం-1996 మరియు అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమ చట్టం-2008లు ఉన్నా వాటివల్ల ఆయా కార్మికులకు పెద్దగా ఒనగూరిన ప్రయోజనం లేదు.ప్రస్తుతమున్న కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలుపరచి కార్మికులను ఆదుకునే చర్యలు ప్రభుత్వాలు ఏమాత్రం చేపట్టడం లేదు.ఇవేమీ చేయకుండాకార్మిక సంస్కరణల పేరుతో కేంద్రంకొత్త కార్మిక చట్టాలకు శ్రీకారం చుట్టింది.
లేబర్‌ కోడ్‌లు
కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను క్రోడీ కరించి నాలుగు కోడ్‌లుగా రూపొందించింది.అవి: వేతనాల కోడ్‌ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్‌ 2020, వృత్తిపరమైన రక్షణ, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌ 2020, సామాజిక భద్రతాకోడ్‌ 2020. ఈ కోడ్‌లు ప్రస్తుతం ఉన్న చట్టాలను సరళీకరించడానికి, ఆధునీకరించడానికి ఉద్దేశించినవని మోదీ సర్కార్‌ చెబుతోంది. ఈ కోడ్‌ల వల్ల కార్మికుల సంక్షేమంతో పాటు నూతన పరిశ్రమల స్థాపనకు కావలసిన పరిస్థి తులు కల్పిస్తున్నామని, తద్వారా సులభతర వాణిజ్యం మెరుగవుతుందని పేర్కొంటోంది. ఈ కోడ్‌ల ద్వారా దేశంలోని 50 కోట్లమంది సంఘటిత మరియు అసం ఘటిత రంగాలలోని కార్మికులకు కనీసవేతనాలు, సామాజిక భద్రత లభిస్తాయని కేంద్రం ప్రకటిస్తోంది. అయితే ఈ నూతన కోడ్‌లు కార్మికుల కంటే కార్పొరేట్‌ వర్గాలకే మేలు చేసే విధంగా ఉన్నాయని కార్మిక సం ఘాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నాయి. కానీ, కాలం చెల్లిన కార్మిక చట్టాలను కాలానుగుణంగా సంస్కరిం చి, కార్మిక విధానాలకు కొత్త రూపు ఇవ్వడం అవస రమే. అయితే అవి కార్మిక వికాసానికి దోహదపడేలా ఉండాలి. ప్రస్తుతమున్న కార్మిక చట్టాలన్నీఇకపై కొన్ని మార్పులు, చేర్పులతో నాలుగు లేబర్‌ కోడుల్లో విలీన మైపోతాయి. తద్వారా కార్మికులకు కొన్ని నూతన ప్ర యోజనాలు లభించే అవకాశమూ ఉంది. అందువల్ల ఎంతో కీలకమైన ఈ కోడ్‌లను కార్మిక సంఘాలు పూర్తి గా వ్యతిరేకించకుండా అననుకూల అంశాలను మాత్ర మే వ్యతిరేకిస్తూ ప్రయోజనకరమైన రీతిలో కోడ్‌లు అమలుకై పోరాడాలి. కార్మిక సంఘాల సలహాలు, సూచనలు తీసుకోకపోవడమే వారి అసంతృప్తికి బల మైన కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు. కనుక లేబర్‌ కోడ్‌లపై కార్మిక సంఘాలు లేవనెత్తిన అభ్యంత రాలను కేంద్రం పరిగణలోకి తీసుకుని తదనుగుణంగా వాటిని సవరించిన పిదప అమలు చేయడం శ్రేయస్కరం.
మేడే హక్కుల సాధన దినం కావాలి
కార్మికుల సమస్యలు పరిష్కారం కావాలంటే ప్రభుత్వాల విధివిధానాల్లో తక్షణం మార్పులు రావా లి. మేడే సందర్భంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మి కులకు భరోసా కల్పించే ప్రకటనలు ద్వారా వారిని చైతన్య పరచాలి. దేశ ఆర్థికాభివృద్ధిలో కార్మికుల పాత్ర ఎనలేనిది. వారిని నిర్లక్ష్యం చేస్తే దేశ అభివృద్ధే కుంటు పడుతుంది. ప్రధాని మోదీ కార్మికులను జాతి నిర్మాత లుగా అభివర్ణిస్తూ దేశాభివృద్ధికి‘శ్రమయేవ జయతే’ శక్తి ‘సత్యమేవ జయతే’తో సమానమని పేర్కొన్నారు. కానీ, మాటల్లో చెప్పినంతగా కార్మిక సంక్షేమం చేతల్లో కానరావడం లేదు. స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్ళు అవు తున్నా భారతీయ కార్మిక వర్గం ఇప్పటికీ హక్కుల కోసం పోరాడవలసి వస్తోంది. కార్మిక దినోత్సవం సందర్భంగా చాలా దేశాల్లో కార్మికులకు సంబంధించి అనేక సంక్షేమ పథకాలు పుట్టుకొచ్చాయి. కనుకమేడే ని హక్కుల సాధన దినంగా పాటించి, కార్మికులు తమ న్యాయ సమ్మతమైన డిమాండ్లను పోరాడిసాధించుకో వాలి. అయితే కార్మికులు తమ కర్తవ్యాన్ని, విధుల్ని విస్మరించరాదు. కార్మికులకు శ్రమే శక్తి, శ్రమే జీవనా ధారం, శ్రమే దైవం. ఆ శ్రమనే నమ్ముకొని ఆత్మ విశ్వా సంతో, ధృడసంకల్పంతో ముందుకు సాగే కార్మికులకు పరాజయం ఉండదు. ‘శ్రమైక జీవన సౌందర్యానికి సమానమైనది ఏదీ లేదు…’ అన్న మహాకవి శ్రీశ్రీ మాటలస్ఫూర్తితో ‘మేడే’నకార్మిక శ్రేణులంతా ఏకమై శ్రమశక్తికి తిరుగు లేదని చాటాలి.

  • పీ.వీ.ప్రసాద్‌,
    9440176824
సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News