Thursday, June 26, 2025
HomeదైవంPalakurthi: శ్రీ సోమేశ్వర ఆలయంలో ఆరుద్రోత్సవం

Palakurthi: శ్రీ సోమేశ్వర ఆలయంలో ఆరుద్రోత్సవం

108 ltr ఆవు పాలు, నెయ్యితో..

శ్రీ సోమేశ్వర లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆరుద్ర నక్షత్రం పురస్కరించుకొని ”ఆరుద్రోత్సవం” కార్యక్రమం మేళతాళాలు, అర్చకుల వేద మంత్రోచ్ఛారణల మధ్య మహా వైభవంగా జరిగింది. సాయంత్రం నాలుగు గంటల నుండి రాత్రి 8:30 గంటల వరకు ఏకాదశ రుద్రాభిషేకం ఆవు పాలు 108 లీటర్లతో అభిషేకం, ఆవు నెయ్యితో గర్భాలయ దీపోత్సవం, పుష్పాలంకరణ, విశేష నీరాజనములు, మంత్రపుష్పము, తీర్థప్రసాద వితరణ సాగింది. ఈ పూజా తతంగాలన్నీ వైభవంగా నిర్వహించారు. ఈ ఆరుద్రోత్సవం కార్యక్రమం భక్తులు పాల్గొని కనులారా తిలకించి తరించారు. శ్రీరామదాసు భజన మండలి ఆధ్వర్యంలో భజన బృందాలు నిర్వహించిన భజనలు అలరించాయి.

- Advertisement -


ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో భాగం లక్ష్మీ ప్రసన్న, ఆలయ ప్రధాన అర్చకులు దేవగిరి లక్ష్మన్న శర్మ, దేవగిరి రమేష్ శర్మ మత్తగాజం నాగరాజు శర్మ, అనిల్ శర్మ, సునిల్ శర్మ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News