Friday, May 10, 2024
Homeఫీచర్స్Cleaning Plastic Furniture: ప్లాస్టిక్ ఫర్నీచర్ క్లీనింగ్

Cleaning Plastic Furniture: ప్లాస్టిక్ ఫర్నీచర్ క్లీనింగ్

క్లీన్ చేయటం ఈజీ అని కెమికల్స్, స్క్రబ్బర్స్ వాడేయకండి

ప్లాస్టిక్ ఫర్నీచర్ శుభ్రం చేస్తున్నారా..
చాలామంది ఇళ్లల్లో ప్లాస్టిక్ ఫర్నీచర్ వాడుతుంటారు. వీటిపై తొందరగా దుమ్ము, ధూళి, మురికి చేరే ప్రమాదం ఉంది. అందుకే వీటిని తరచూ శుభ్రం చేస్తుండాలి. లేకపోతే అవి చూడడానికి ఎంతో డల్ గా
కనిపిస్తాయి. దుమ్ము, మురికి వాటిపై పేరుకుని ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిది కాదు. అయితే ప్లాస్టిక్ ఫర్నీచర్ ను శుభ్రం చేసేటప్పుడు సహజంగా మనం కొన్ని పొరబాట్లు చేస్తుంటాం.

- Advertisement -

ప్లాస్టిక్ ఫర్నీచర్ తళ తళ మెరవాలని రకరకాల కెమికల్స్ తో వాటిని క్లీన్ చేస్తుంటాం. వీటితో ఫర్నీచర్ ను శుభ్రం చేయడం సులభం అని అనుకుంటాం. కానీ శక్తివంతమైన రసాయనాలతో ఫర్నీచర్ ను శుభ్రం చేయడం వల్ల అవి దెబ్బతినే అవకాశం ఉంది. ఆ రసాయనాలు ఫర్నీచర్ రంగును పోగొట్టి వెలిసిపోయేట్టు చేస్తాయి. లేదా తొందరగా ఆ ప్లాస్టిక్ ఫర్నీచర్ దెబ్బతినే అవకాశం ఉంది. అందుకే ప్లాస్టిక్ ఫర్నీచర్ ను మైల్డ్ క్లీన్సర్లతో శుభ్రం చేయడం సర్వదా శ్రేయస్కరం. ప్లాస్టిక్ ఫర్నీచర్ ను శుభ్రం చేసేటప్పుడు ఫర్నీచర్ పై పేరుకున్న దుమ్ము బాగా పోగొడుతుందని స్క్రబ్బర్ ను వాడతాం. స్టీల్ స్ర్కబ్బర్, ప్లాస్టిక్ స్క్రబ్బర్ వాడడం వల్ల ఫర్నీచర్ పై గీతలు పడతాయి.


అందుకే మెత్తని క్లాత్ మెటీరియల్ తో ప్లాస్టిక్ ఫర్నీచర్ ని క్లీన్ చేస్తే పాడవకుండా ఉంటాయి. ప్లాస్టిక్ ఫర్నీచర్ ను నిత్యం క్లీన్ చే చేయకపోతే వాటిపై దుమ్ము మందంగా పేరుకుని వాటిని శుభ్రం చేయడం చాలా కష్టమవుతుంది. ప్లాస్టిక్ ఫర్నీచర్ ను నీటితో కడిగి శుభ్రం చేసిన తర్వాత అవి ఆరిపోవాలని ఎండలో పెడుతుంటాం. అలా అస్సలు చేయొద్దు. అలా చేయడం వల్ల ప్లాస్టిక్ ఫర్నీచర్ కలర్ పోవడమే కాకుండా ఆ ఫర్నీచర్ తొందరగా దెబ్బతింటుంది కూడా.

అందుకే ముఖ్యంగా ఎక్కువ సేపు సూర్యకాంతికి నేరుగా ప్లాస్టిక్ ఫర్నీచర్ పెట్టి ఆరబెట్టాలని చూడొద్దు. ప్లాస్టిక్ ఫర్నీచర్ ను క్లీన్ చేసేటప్పుడు ఎక్కువగా బ్లీచ్ చేస్తుంటాం. అలా అస్సలు చేయకూడదు. పరిమితంగా బ్లీచింగ్ చేస్తే ఫరవాలేదు కానీ అతిగా బ్లీచింగ్ చేస్తే మాత్రం ఆ ఫర్నీచర్ బాగా దెబ్బతింటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News