Thursday, June 26, 2025
Homeచిత్ర ప్రభActor Krishna: డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. నటుడు కృష్ణను విచారించిన పోలీసులు

Actor Krishna: డ్రగ్స్ కేసులో కీలక మలుపు.. నటుడు కృష్ణను విచారించిన పోలీసులు

Kollywood Drug Case: తమిళనాడులో ప్రకంపనలు సృష్టిస్తున్న డ్రగ్స్ కేసుఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. సినీ వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతున్న ఈ వ్యవహారం, ఇప్పుడు మరో బిగ్ ట్విస్ట్ తీసుకుంది. ఈ కేసులో మొదట డ్రగ్స్ తీసుకున్నట్లు నిర్ధారణ కావడంతో పోలీసులు నటుడు శ్రీకాంత్ అలియాస్ శ్రీరామ్ (Sriram)ను అరెస్ట్ చేశారు. ఆయ‌న‌కు కోర్టు 14 రోజులు జ్యుడిషియ‌ల్ విధించింది. అయితే, శ్రీకాంత్ ఇచ్చిన సమాచారం ఆధారంగా, పోలీసులు మరో నటుడు కృష్ణను అదుపులోకి తీసుకున్నారు. త‌మిళంలో ధ‌నుష్‌(Dhanush)తో హీరోగా న‌టించిన మారి2 (Maari 2)లో ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించాడు కృష్ణ. ఇంకా ప‌లు చిత్రాల్లో యాక్ట్ చేశాడు. ఈ యాక్ట‌ర్ డ్రగ్స్ వాడినట్లు మొదటి నుంచీ ప్రచారం జరిగింది, కానీ ఇప్పుడు అతని వాదన అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.

- Advertisement -

పోలీసులు కృష్ణను విచారిస్తుంటే కొన్ని విషయాలు బయటపడినట్లు తెలుస్తోంది. ‘నాకు ఈ డ్రగ్స్ కేసుతో అస్సలు సంబంధం లేదు’ అని కృష్ణ ఖరాఖండిగా వెల్లడించినట్లు చెబుతున్నారు. శ్రీరామ్ కేవలం తన స్నేహితుడు మాత్రమేనని, అంతే తప్ప డ్రగ్స్ వ్యవహారంలో తన ప్రమేయం లేదని కృష్ణ గ‌ట్టిగా చెబుతున్నారు. అంతేకాదు, తాను 2018 నుంచే తీవ్రమైన అలర్జీతో బాధపడుతున్నానని, అందుకే డ్రగ్స్ తీసుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశాడు. తన అరెస్ట్ గురించి జరుగుతున్న ప్రచారంపై కూడా కృష్ణ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. తన వాదనకు బలం చేకూర్చుకునేందుకు సంబంధించిన మెడికల్ రిపోర్టులను తన న్యాయవాదులకు, అలాగే పోలీసులకు చూపించినట్లు సమాచారం.

ALSO READ:https://teluguprabha.net/cinema-news/naga-chaitanya-upcoming-movie-is-set-to-feature-ram-pothineni/

అయితే, చెన్నై పోలీసులు (Chennai police) ఈ విషయాన్ని అంత తేలిగ్గా తీసుకోవడం లేదు. ఈరోజు విచారణలో భాగంగా కృష్ణ రక్త నమూనాలను సేకరించారు. ఇప్పుడు అందరి దృష్టి ఈ వైద్య పరీక్షల ఫలితాలపైనే ఉంది. ఫలితాల ఆధారంగానే పోలీసులు తదుపరి చర్యలు తీసుకోనున్నారు. హీరో శ్రీరామ్ అన్నా డీఎంకే నేత ప్రసాద్ కారణంగానే తనకు డ్రగ్స్ అలవాటైందని పేర్కొన్నారు. అతని నిర్మాణంలో తాను చేసిన సినిమాకు సంబంధించి రెమ్యునరేషన్ పది లక్షలు ఇవ్వలేదని, ఆ విషయం అడిగినప్పుడు రెండు సార్లు కొకైన్ ఇచ్చాడని, మూడోసారి నుంచి తానే కొకైన్ కోసం వెళ్లినట్లు శ్రీరామ్ పోలీసుల విచారణలో పేర్కొన్నారు. ఈ కీలకమైన దర్యాప్తు, కోకైన్ స్కాండల్‌లో (cocaine scandal) ఎలాంటి మలుపులు తిరుగుతుందో, కృష్ణ డ్రగ్ ప్రోబ్ (Krishna drug probe) ఎటువైపు వెళ్తుందో అన్న టెన్షన్ సినీ వర్గాల్లో నెలకొంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News