Thursday, June 26, 2025
Homeఆంధ్రప్రదేశ్KTR: ఏపీ సీఎం చంద్రబాబుకు కేటీఆర్ ధన్యవాదాలు

KTR: ఏపీ సీఎం చంద్రబాబుకు కేటీఆర్ ధన్యవాదాలు

తెలంగాణ తలసరి ఆదాయంపై మాట్లాడిన ఏపీ సీఎం చంద్రబాబు(Chandrababu)కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) ధన్యవాదాలు తెలిపారు. ఈమేరకు ఎక్స్ వేదికగా చంద్రబాబు మాట్లాడిన వీడియోను పోస్ట్ చేశారు. “ప్రభుత్వ ప్రగతిశీల విధానాల వల్లే భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా తెలంగాణ అవతరించిందని ఏపీ సీఎం చంద్రబాబు గారు చాలా సందర్భాల్లో నిజాయితీగా అంగీకరించారు. ఇందుకు చంద్రబాబు గారికి ధన్యవాదాలు. ఈ వాస్తవాన్ని జీర్ణించుకోలేని మీ పూర్వ శిష్యుడుకి దయచేసి అవగాహన కల్పించండి” అంటూ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy)పై సెటైర్లు వేశారు.

- Advertisement -

కాగా పలు సందర్భాల్లో హైదరాబాద్‌ అభివృద్ధి, తెలంగాణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. తాజాగా, దావోస్‌ పర్యటనలోనూ తలసరి ఆదాయంలో దేశంలోనే తెలంగాణ నెంబర్‌ వన్‌గా ఉందంటూ కొనియాడారు. అలాగే సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలోనూ ఇదే అంశాన్ని ప్రస్తావించారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News