Thursday, June 26, 2025
Homeచిత్ర ప్రభSreeleela: శ్రీలీల చేయి జారుతున్న అవకాశాలు..?

Sreeleela: శ్రీలీల చేయి జారుతున్న అవకాశాలు..?

Akhil Akkineni – Lenin: అక్కినేని అఖిల్ గత చిత్రం తీవ్రంగా నిరాశపరిచింది. కెరీర్‌లో హిట్ అనేది ఎరగని అక్కినేని కుర్ర హీరో కిందా మీదా పడి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాతో ఓ హిట్ కొట్టాడు. అయితే, సక్సెస్ క్రెడిట్ ఎక్కువభాగం హీరోయిన్‌గా నటించిన పూజా హెగ్డేకే వెళ్ళింది. ఆ తర్వాత కండలు పెంచి స్టైలిష్ చిత్రాల దర్శకుడిగా పేరు తెచ్చుకున్న సురేందర్ రెడ్డితో ఏజెంట్ సినిమా చేసి ఫ్లాప్ చూశాడు.

- Advertisement -

ఇప్పుడు ‘వినరో భాగ్యము విష్ణు కథ’ ఫేమ్ మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం అఖిల్ హీరోగా ‘ లెనిన్ ’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు. ఇప్పటికే, ఈ సినిమా నుంచి టీజర్ వచ్చి బాగానే అంచనాలను పెంచేసింది. ఇందులో అఖిల్ సరసన క్రేజీ బ్యూటీ శ్రీలీల నటిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుగుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా కథ రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో పక్కా మాస్ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో ఉంటుందట. అఖిల్‌కి తండ్రిగా అక్కినేని నాగార్జున ఈ సినిమాలో నటించనున్నారని ఇటీవల నెట్టింట వార్తలొచ్చాయి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/kollywood-actor-krishna-arrested-by-police-in-tamil-nadu-drug-case-investigation/

పవర్‌ఫుల్‌ పాత్ర గనకనే నాగ్ అయితే ఈ రోల్‌కి పర్ఫెక్ట్ అని మేకర్స్ ఫిక్స్ చేసుకున్నారట. ఈ మధ్య నాగార్జున కథ నచ్చితే కీలక పాత్రలో కనిపించడానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు. ఇటీవల వచ్చి హిట్ సాధించిన కుబేర, కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న కూలి సినిమాలే ఇందుకు ఉదాహరణ. అయితే, ఈ సినిమాలో నాగార్జున నటిస్తున్నారా లేదా అనే విషయంలో ఇంకా అధికారికంగా వెల్లడించలేదు.

ఇక లెనిన్ కథను గతంలో తెలుగు రాష్ట్రాల్లో జరిగిన కొన్ని పరువు హత్యలను ఆధారంగా చేసుకుని దర్శకుడు మురళీ కిషోర్ రాసుకున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపిస్తోంది. అయితే, ఈ సినిమాలో అఖిల్ కి జంటగా నటిస్తున్న శ్రీలీలను మేకర్స్ తొలగించినట్టుగా లేటెస్ట్ న్యూస్ ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతోంది. మాస్ జాతర (Mass Jathara), ఉస్తాద్ భగత్‌సింగ్ (Ustaad Bhagat Singh) సినిమాలతో పాటు తమిళంలో పరాశక్తి, హిందీలో ఆషికీ 3 చేస్తోంది. ఈ నేపథ్యంలో లెనిన్ (Lenin) సినిమా షూటింగ్ కోసం అమ్మడు డేట్స్ సరిగ్గా కేటాయించలేకపోతుందట. ఇప్పటికే శ్రీలీల వల్ల చాలారోజులు వెయిట్ చేసిన మేకర్స్ ఇక లాభం లేదని ప్రాజెక్ట్ నుంచి తీసేసినట్టుగా ప్రచారం జరుగుతోంది. మరి దీనిపై మేకర్స్ క్లారిటీ ఎప్పుడిస్తారో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News